సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా వెనక్కి తగ్గినప్పటికీ గల్ఫ్ లో ఇరాన్ , ఇజ్రాయిల్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ముడి చమురు ధరలు అంతకంతకూ పెరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌‌పై అదనపు ఎక్సైజ్ డ్యూటీలో రూ.10 మేర ప్రభుత్వం కోత విధించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం పెట్రోల్‌పై రూ.13గా ఉన్న అదనపు ఎక్సైజ్ డ్యూటీ ప్రభుత్వ నిర్ణయంతో రూ.3కు చేరుకుంది. డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా తొలగిపోయింది.ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 106.33 డాలర్లుగా ఉంది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 93.5 డాలర్ల వద్ద దిగివచ్చింది. ఇరాన్‌తో జరుపుతున్న చర్చలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని కూడా ట్రంప్ పేర్కొనడం విశేషం. ఒక వేళ అమెరికా సైన్యం దొంగదెబ్బ తీసి ఇరాన్ భూభాగంలోకి అడుగుపెడితే ఇరాన్ ప్రక్కన దుబాయ్ లోకి అడుగుపెడుతుందని అనధికార హెచ్చరికలు ప్రచారంలో ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *