సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయుల న్యాయమైన కోర్కె లను పరిష్కరించాలని, వారి సమస్యల పరిష్కారం కోసం ఫ్యాప్టో ఆధ్వర్యంలో కోసం ఈనెల 7న చేపట్టిన చలో విజయవాడ పోరు బాట కార్య క్రమాన్ని జయప్రదం చేయాలని ఫ్యాప్టో చైర్మన్ పీఎస్ విజయరామరాజు (FAPTO) పిలుపు ఇస్తూ భీమవరంలో కరపత్రాలు , పోస్టర్లు పంపిణీ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా చలో విజయవాడ పోరు బాట కార్య క్రమం కు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలిరావాలని అక్కడ ధర్నా ను విజయవంతం చెయ్యాలని పిలుపు నిచ్చారు.
