సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో ఇష్టం వచ్చినట్లు ట్రాఫిక్ నియమాలను నిర్లక్ష్యం చేసే వాహనదారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజగా గురి పెట్టింది. ఈ మేరకు నిబంధనలు మరింత కట్టుదిట్టం చేసేందుకు 1989 మోటార్ వాహనాల చట్టంలో కొన్ని కీలక సవరణలు చేయాలని నిర్ణయం తీసుకుంది.ఈ కొత్త సవరణల ప్రకారం ఒక వాహనంపై ఐదు లేదా అంకుమించి చలాన్లు ఉంటే ఆ వాహననదారుడి డ్రైవింగ్ లైసెన్సును సంబంధిత అధికారి సస్పెండ్ చేయొచ్చని ఈ కొత్త సవరణ చెబుతోంది. అలాగే మన వాహనంపై పడిన చలాన్ కట్టేందుకు ఇంతకు ముందు 90 రోజుల గడువు ఉండగా దాన్ని ఇప్పుడు 45 రోజులకు తగ్గించింది. మీ వాహనంపై విధించిన చలాన్‌ను 45 రోజుల లోపు చెల్లించక పోతే ఆ వాహనాన్ని ఎవరికీ అమ్మడం కుదరదు. అలాగే మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యువల్ చేసుకోవడం కూడా కుదరదు.
