సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల విడుదలయిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఫలితాలలో ఈసారి పశ్చిమ గోదావరి జిల్లాలో 21,539 మంది పరీక్షలు రాయగా 17,695 మంది ఉత్తీర్ణత సాధించారు. .అయితే ఉత్తీర్ణతా శాతం గత ఏడాది కన్నా మెరుగ్గా 82.15. బాలురు 10,924 మందికి 8,612 ( బాలురు 78.84 శాతం) మంది ఉత్తీర్ణులు కాగా, బాలికలు 10,615 మందికి 9,083 ( బాలికలు 85.57 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వీరిలో అత్యధికులు ఫస్ట్‌ క్లాస్‌లో 14,174, సెకండ్‌ క్లాస్‌లో 2,340, థర్డ్‌ క్లాస్‌లో 1,181 మంది ఉన్నారు. జిల్లాలో గతం కంటే ఈ ఏడాది విద్యార్థులు అధిక శాతం ఉత్తీర్ణత సాధించారు. గతేడాది 81.82 శాతం మంది పాస్‌ కాగా ఈసారి ఆ ఉత్తీర్ణత శాతం 82.15 శాతానికి పెరిగింది. గతంలో రాష్ట్రంలో 23వ స్థానంలో నిలవగా ఇప్పుడు మెరుగ్గా 16వ ర్యాంకు సాధించింది.ఇక పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఏదైనా అనుమానాలు ఉన్న విద్యార్థులు పరీక్ష పత్రాల మార్కుల రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ కోసం ఈ నెల 24 నుంచి మే ఒకటో తేదీ మధ్యాహ్నం 11 గంటల వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని డీఈవో నారాయణ తెలిపారు. రీకౌంటింగ్‌కు సబ్జెక్టుకు రూ.500, రీ వెరిఫికేషన్‌కు సబ్జెక్టుకు రూ.1000 సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఫీజు చెల్లించాలని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *