సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవిత్ర పంచా రామం గునుపూడి లో శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవస్థానం నందు నేడు, మంగళవారం 21వ రోజు విశేషంగా భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకొంటున్నారు. ఈ కార్తీక మాస సీజన్ లో రికార్డు స్థాయిలో నిన్న సోమవారం శ్రీ స్వామివారి ఆలయమునకు సుమారుగా ’25 వేల మంది’ భక్తులు విచ్చేయగా దర్శనముల టికెట్స్ ద్వారా రూ- 6,88,950/- రూపాయలు లడ్డు ప్రసాదం విక్రయం ద్వారా రూ-45,000/- వేల రూపాయలు వెరసి మొత్తం రూ- 7,33,950/- రూపాయలు ఆదాయం వచ్చి ఉన్నది. మరియు శ్రీ స్వామివారి నిత్య అన్నదానం నందు రూ- 1, 34,262 /-రూపాయలు ఆదాయము లభించిందని, ది మోటారు అండ్ లారీ యూనియన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా వేలాది భక్తులకు అన్నసమారాధన జరిగిందని దేవాలయ కార్యనిర్వహణాధికారి డి రామకృష్ణంరాజు తెలిపారు.
