సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హిందీ చిత్ర సీమలో ఒకనాటి హి మాన్ గా పేరొందిన బాలీవుడ్ లెజెండరీ నటుడు, ‘షోలే’ హీరో ధర్మేంద్ర (89) కన్నుమూసినట్లు నేటి మంగళవారం ఉదయం నుండి పలు మీడియా ఛానెల్స్ లో జరుగుతున్నా ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, ఈ దారుణ ప్రచారం ఆపాలని ఆయన కుమార్తె ఈషా డియోల్ తెలిపారు. ధర్మేంద్ర కొద్దీ రోజుల క్రితం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో ఆయన్ను కుటుంబసభ్యులు ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌కు తరలించారు. ధర్మేంద్ర ఆరోగ్యం గురించి వార్తలు బయటకు రావడంతో అభిమానులు తీవ్రంగా కలత చెందారు. ధర్మేంద్ర త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. ధర్మేంద్ర ఇప్పటికి అడపా దడపా కొన్ని చిత్రాలలో గెస్ట్ పాత్రలలో అభిమానులను పలకరిస్తున్నారు. ధర్మేంద్ర కుమారులే సన్నీ డియోల్, బాబీ డియోల్ ఇంకా పాన్ ఇండియా సినిమాలతో వారి హావ కొనసాగిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *