సిగ్మాతెలుగు డాట్, ఇన్, న్యూస్: మండు వేసవిలో గత 5 రోజులుగా వర్షాలు పడుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భీమవరంలో సైతం ఇదే ధోరణి కొనసాగుతుంది, నేటి గురువారం ఉదయం చిరుజల్లు పడినప్పటికీ మధ్యాహ్నం మంచి ఎండ కాసింది. అయితే మరల ఆకాశం మేఘ వృతం అయ్యి ఈ వేసివిలో ఇవేం వర్షాలురా! అంటూ జనం విస్తుపోయేలా చేస్తున్నాయి,ఆకివీడులో జిల్లాలోనే అత్యధిక వర్షపాతం నమోదు అవుతుంది, ఇక బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి, తూర్పు, పడమర గాలులు వేగంలో మార్పు కారణంగా ఈ నెల 26వ తేది వరకు ఆంధ్ర ప్రదేశ్ ,తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్, లలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ పరిశోధకులు భావిస్తున్నారు. చెన్నై, శివారు, రాయలసీమ ప్రాంతాల్లో రానున్న 48 గంటల్లో ఆకాశం మేఘా వృతంగా ఉంటూ ఒకటి, రెండు ప్రాంతాల్లో ఉరుము లతో కూడిన స్వల్ప వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలియజేసింది.
