సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో రాష్ట్ర పతి పాలన పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. ప్రతిరోజూ అధికార నేతల అరాచకం తో శాంతి భద్రతలు అదుపు తప్పాయని, ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన కేవలం 50 రోజులలో 35 మంది వైసీపీ నేతలు రాజకీయ హత్యలకు గురి అయ్యారని, ఆస్తులు ధ్వసం చేస్తున్నారని, ఇక్కడ లోకేష్ బాబు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందని వందలాది దాడులు జరుగుతున్నాయని, వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జాతీయ మీడియా ముందు వ్యాఖ్యానించారు. అంతే కాదు వైసీపీ ఎంపీలు, ఎమెల్య లు, ఎమ్మెల్సీ లతో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు దాదాపు అందరూ వైసీపీ ప్రజాప్రతినిదులు పాల్గొనడం గమనార్హం.. ధర్నా తో పాటు నేటి సాయంత్రం వరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద స్థాయిలో రాష్ట్రంలోని పరిస్థితులపై జంతర్ మంతర్ వద్ద ఫోటో, వీడియో ఎగ్జిబిషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇండియా కూటమిలోని పలువురు ఎంపీ లు వీటిని ఆసాంతం వీక్షించి ఏపీలో పరిస్థితి దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు. వైసీపీ ఆందోళనకు ఇండియా కూటమిలో అగ్రనేత, అతి పెద్ద రాష్ట్రము యూపీ లో ఎంపీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ జగన్ కు మద్దతుగా సంఘీభావం ప్రకటించడమే కాదు.. కార్యకర్తల కోసం పోరాడుతున్న జగన్ తీరు అభినందనీయం, ఈ రోజు చంద్రబాబు సీఎం కావచ్చు .. రేపు మరల జగన్ సీఎం కావచ్చు ..ఇలా కార్యకర్తలపై దాడులు చేసుకొంటూ పొతే ఎలా? అంటూ సంచలన వ్యాఖ్యలు చెయ్యడం జాతీయ మీడియాలో హైలైట్ గా నిలచింది. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించిన శివసేన ఫైర్ బ్రాండ్ (ఉద్ధవ్ థాకరే గ్రూప్) ఎంపీ, సంజయ్ రౌత్, తృణమూల్ కాంగ్రెస్ , కేరళ , తమిళనాడు అన్నాడీఎంకే, ఒరిస్సా లోని బిజూ జనతాదళ్ వంటి ఏ కూటమిలోని లేని రాజకీయ పార్టీల ఎంపీలు నేతలు జగన్ ధర్నా కు సంఘీభావం ప్రకటించి ఏపీలో దాడులు ను ఖండించారు. మరి కొందరు ఎంపీలు ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేసారు.
