సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక ప్రక్క క్రొత్త ఏడాది పండుగల సీజన్ దూసుకొని వస్తుంది. మరో ప్రక్క ఇటీవల బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు రోజువారీగా పెరిగిపోవడం మొదలయింది. అయితే, ఈ క్రమంలోనే నిన్నగురువారం రూ.550 మేర పెరిగిన బంగారం ధరకు పెరిగినంతగా తగ్గకున్నా నేడుశుక్రవారం కాస్త దిగివచ్చింది. విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ లలో నేటి, శుక్రవారం ఉదయం దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.310 మేర తగ్గి రూ.49,990కి చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.350 తగ్గి రూ.54,530కి అమ్మకాలు చేస్తున్నారు. దేశీయంగా కిలో వెండి ధర నిన్న రూ.2000 పెరగ్గా.. నేడు రూ.1300 మేర తగ్గి.. రూ.72,700 లకు చేరింది.
