సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మహాశివరాత్రి వెళ్ళగానే మంచు తెరలు తొలగిపోయి ఎండలు దంచి కొడతాయని అందరికి తెలిసిందే.. అయితే ఈ సారి గతంతో పోలిస్తే ఇప్పటికే వేసవి సెగలు కక్కుతోంది. అయితే గత ఏడాది వేసవి తో పోలిస్తే ఈ వేసవి అదనంగా 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం ఒక ప్రకటనలో తెలియజేసింది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ ఫై కూడా ఉంటుంది. మరో 2 రోజులలో తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ ప్రాంతాలలో పగటి పూట ఎండ తీవ్రత పెరుగుతుందన్నారు. చెన్నై, శివారు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతంగా ఉంటూ, పగటి ఉష్ణోగ్రతలు 33-34 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 21-22 డిగ్రీలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.
