సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేశారు. నేడు, శుక్రవారం ఉదయం రాజ్‌భవన్‌లో అబ్దుల్ చేత హైకోర్టు సీజే ప్రశాంత్‌కుమార్ మిశ్రా ప్రమాణం చేయించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి మూడో గవర్నర్‌గా అబ్దుల్ నజీర్ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్. ప్రతి పక్ష నేత చంద్రబాబు, రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కర్ణాటక కు చెందిన అబ్దుల్ నజీర్ సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పనిచేసి గతనెలలో రిటైర్ అయ్యారు. సుప్రీంకోర్టు జడ్జి గా గతంలో జస్టిస్ అబ్దుల్ నజీర్ కీలక తీర్పులు ఇచ్చారు. అయితే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా పనిచేయకుండానే నేరుగా దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రమోట్ వారిలో మూడో వ్యక్తిగా అబ్దుల్ నజీర్ ప్రత్యేకత పొందారు. గత రాత్రి గన్నవరం ఎయిర్‌పోర్టు కు చేరుకున్న కొత్త గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు సీఎం జగన్ , శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషన్ రాజు తదితరులు ఘన స్వాగతం పలికారు.
