సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:ఈ నెల 11న ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి, చంద్రబాబు చేతుల మీదుగా బలహీనవర్గాలకు, వృత్తిదారులకు పనిముట్లు, రుణాలు పంపిణీ చేయనున్నట్లు గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రకటించారు. సీఎం పర్యటన సందర్భంగా కలెక్టర్ కె.వెట్రి సెల్వి, జేసీ పి.ధాత్రిరెడ్డి, వివిధ శాఖల అధికారులతో కలసి మంత్రి పరిశీలించి, ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 11న మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని రాష్ట్రస్థాయి ఉత్సవంగా ఆగిరిపల్లిలో నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరై బలహీన వర్గాల జీవనోపాధికి అవసరమైన పనిముట్లు, రుణాలను పంపిణీ చేస్తారు. వారి వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకుంటా రని మంత్రి చెప్పారు.
