సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో అంత దూకుడు లేనప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి, అటు తెలంగాణాలో కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి, అసలే గంట వర్షం వస్తే చాలు రోడ్డులు మునిగిపోయే హైదరాబాద్ రోడ్డులతో పాటు ఎడతెరిపిలేని వర్షాల కారణంగా తెలంగాణలో స్కూల్స్ కు కూడా సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. మరోవైపు.. ఇంకా రెండు రోజులు పాటు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉం దని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే తాజా వాతావరణ శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం ఈనెల 24వ తేదీన బంగాళాఖాతం లో మరో అల్ప పీడనం ఏర్ప డనున్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈనేపథ్యం లో ఏపీలో మరిన్ని రోజులు రోజుల పాటు భారీ వర్షాలే కురిసే అవకాశం ఉంది.
