సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఢిల్లీలో ఈ నెల 31వ తేదీ ఎల్లుండి శుక్రవారం నుండి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు (Parliament) ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రేపు గురువారం ఉదయం 11.30 గంటలకు అఖిలపక్ష సమావేశం రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ నేతృత్వంలో నిర్వహిస్తుంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే పలు బిల్లులు, ప్రభుత్వ బిజినెస్‌పై అఖిలపక్షానికి కేంద్రం తరఫున రాజనాథ్ సింగ్ వివరించనున్నారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కొరనున్నారు. కాగా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముఉభయసభలను ఉద్దేశించి లోకసభ ఛాంబర్ లొనే ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం సుమారు అరగంట సేపు విడివిడిగా ఉభయసభలు భేటీ కానున్నాయి. శుక్రవారం రోజునే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. లోకసభలో బడ్జెట్ ఆర్థిక సర్వే టేబుల్ చేయనున్నారు.
