సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక.. విజయవాడ డివిజన్‌లో రోలింగ్ కారిడార్‌ను బ్లాక్ చేయనున్న నేపథ్యంలో ఈనెల 13 నుంచి పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు, మరికొన్నింటిని మళ్లింపు మార్గంలో నడిపించనున్నట్టు వాల్తేరు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈనెల 13న ఎర్నాకులం-పాట్నా ఎక్స్‌ప్రెస్ (22643), 13, 15, 17, 18 తేదీల్లో ముంబై-భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (11019), 15, 17 తేదీల్లో బెంగుళూరు-గుహవటి ఎక్స్‌ప్రెస్ రైళ్లు వయా గుడివాడ, భీమవరం టౌన్, మీదుగా నడుస్తాయి.ఈనెల 13 నుంచి 19వ తేదీ వరకు కాకినాడ-విశాఖపట్నం (17267), విశాఖ-కాకినాడ (17268), రాజమండ్రి-విశాఖ (07466), విశాఖ-రాజమండ్రి (07467), మచిలీపట్నం-విశాఖ ఎక్స్‌ప్రెస్ (17219), గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్ (17243), గుంటూరు-విశాఖ సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (17239) రద్దు చేసారు. ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు విశాఖ-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ (17220), రాయగడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్ (17244), విశాఖ-గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (17240) రద్దుచేసారు. ఈనెల 13, 14, 15, 17, 18 తేదీల్లో విజయవాడ-విశాఖ మధ్య నడిచే ఉదయ్ ఎక్స్‌ప్రెస్ (22702/22701) రైళ్లు రద్దు చేసారు.
