సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎండలు మండిపోతున్నాయి. మరో ప్రక్క ధవళేశ్వరం కాటన్ బ్యారేజి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాతో సహా ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు నీటిని తీసు కుని వెళ్లే డెల్టా కాలువలను ఈ నెల 16 నుండి నీటిని కట్టివేస్తునారు. పార్టీ వేసవిలో పంట కాల్వలకు నీటి సరఫరా ను నిలిపివేసి, కాల్వల్లో సిల్ట్, తూడు తొలగింపు, ఇతర ఇరిగేషన్ అభివృద్ధి పనులు నిర్మాణాలు చేస్తుంటారు. రబీ ముగిసిన తర్వాత, మంచినీటి అవసరాలకు నీటిని ఇచ్చి కాల్వలలో నీరు కట్టేసి తిరిగి జూన్ 1న తెరిచే అవకాశం ఉంది. సాధారణంగా రబీ సీజన్‌తోపాటు మంచినీటి అవసరాలు, చెరువుల కోసం 120 టీఎంసీల వరకూ అంచనా వేస్తారు. ఇప్పటి వరకూ 103 టీఎంసీలు నీటిని వాడేశారు. ఇంకా 10 రోజులపాటు కాల్వ లకు నీరు ఇస్తారు కాబట్టి, ఈలోపు పంట అవసరాలు, ప్రజల మంచినీటి అవసరాలు కు తగినంత నీరు అధికారులు స్థానిక ట్యాంక్లలో రిజర్వాయర్ లలో సద్వినియోగ పరుచుకోవాలి.అని ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ధవళేశ్వరం బ్యారే జీ నీటిమట్టం ప్రస్తుతం 9.5 అడుగు లు ఉంది. గత ఏడాది ఇదే సమయానికి కేవలం 6.05 అడుగులు మాత్రమే ఉంది. గత ఏడాదికంటే ఎక్కువ నీరే అందుబాటులో ఉండటం శుభపరిణామం.
