సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి మండలం కోలమూరు గ్రామంలోని ఆదర్శ ప్రాథమిక పాఠశాలను నేడు, సోమవారం కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ సందర్శించారు. పాఠశాల సభలో ఆయన మాట్లాడుతూ .. ఈ పాఠశాల పూర్వవైభవాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, పార్లమెంట్ జిల్లా పార్టీ కన్వీనర్ పేరిచర్ల సుభాష్ రాజు, ప్రధానోపాధ్యాయులు రాజేశ్వరి తదితరులు తన దృష్టికి తీసుకురావడంతో అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు . పాఠశాలను ఆదర్శ పాఠశాలగా గుర్తించేందుకు కనీసం 45 మంది విద్యార్థులు అవసరమన్న నిబంధనను నెరవేర్చేందుకు గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు చేసిన కృషి అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా దాతలు సహకారంతో సుమారు 25 మంది విద్యార్థులకు రూ.5,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. విద్యార్థులకు పుస్తకాలు, స్కూల్ బ్యాగులు, యూనిఫారంలను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో ఉన్న మంచినీటి చెరువును కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ పరిశీలించారు
