సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ష్యాను ఆర్ధికంగా దెబ్బతీసి ఉక్రేన్ యుద్ధం విరమింప చెయ్యాలని అమెరికా సత్తా చూపాలని ట్రంప్ బెదిరింపులకు దిగాడు. దీనితో రష్యా నుండి పెట్రోల్ కొంటె మిత్ర దేశాలు భారత్, చైనా ల ఉత్పత్తులపై 500 శాతం పన్ను లు వేస్తామని అమెరికా బెదిరిస్తుండటం తో భారత్ త్రిప్పి కొట్టింది. భారత్ కూడా అమెరికా ఫై భారీ ఎత్తున పన్నులు విధించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇక యూక్రెయిన్‌తో యుద్ధం పై రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ట్రంప్‌ గురువారం సుదీర్ఘంగా చర్చలు విఫలం అయ్యాయి. పుతిన్ తగ్గేదే లే.. అంటూ నిన్న ఉక్రెయిన్‌లోని 8 ప్రాంతాల్లో రష్యా దాడులు చేసినట్లు కీవ్‌ ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం 40 అపార్ట్‌మెంట్లు ధ్వంసమైనట్లు పేర్కొంది. రైల్వే ట్రాక్‌లు, సిగ్నలింగ్‌ వ్యవస్థ దెబ్బతిన్నాయని వెల్లడించింది..తాజాగా శుక్రవారం మరోసారి కీవ్‌పై రష్యా డ్రోన్లతో విరుచుకుపడింది. మొత్తం 539 డ్రోన్లు, 11 క్షిపణులతో దాడి చేసినట్లు ఉక్రెయిన్‌ ఎయిర్‌ఫోర్స్‌ వెల్లడించింది. ఈ దాడుల్లో కీవ్‌లోని పోలండ్‌ దౌత్యకార్యాలయం దెబ్బతిన్నట్లు ఉక్రెయిన్‌ వెల్లడించింది.అమాయక ప్రజలు పరుగులు పెడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇక ఆలస్యం చెయ్యకుండా ఉక్రెయిన్ ఫై దాడులను కనివిని ఎరుగని రీతిలో చేసి పూర్తిగా హస్తగతం చేసుకొని, ద్వంద ప్రమాణాలు పాటించే అమెరికా అహం దెబ్బతీసి నాటో దేశాలకు గుణపాఠం చెప్పాలని చూస్తున్నాడు పుతిన్‌. దీనిలో భాగంగా ఉత్తర కొరియా నుండి 20 వేలు సైనికులు రష్యా మద్దతుగా చేరుకొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *