సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద హైటెన్షన్ నేడు, శుక్రవారం 2వ రోజు కూడా కొనసాగుతోంది. ఏపీలో రైతులకోసం ఎన్ని విజ్ఞప్తులు చేసిన తెలంగాణ ప్రభుత్వ ము నిబంధనలు పేరుతొ .. నాగార్జున సాగర్ డ్యామ్ నుండి రాయలసీమ ప్రాంత రైతులకు నీళ్లు వదలని కారణంగా అక్కడ పంటలు ఎండిపోతుండటంతో ఇక ఏపీలోని జగన్ సర్కార్ దూకుడుగా వ్యవహరించింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు లో ఆంధ్ర ప్రదేశ్ కు ఉన్న సగభాగం 13 గేటు వరకు వందలాది ఏపీ పోలీసులు వెళ్లి స్వాధీనం చేసుకోవడం అక్కడ అక్కడ కంచె వేసెయ్యడం.. గేట్లు ఎత్తివేసి నీరు వదిలెయ్యడం తో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. అటువైపు తెలంగాణ పోలీసులు కూడా భారీగా చేరుకొని ఏపీ పోలీస్ చర్య ఫై అభ్యన్తరం వ్యక్తం చెయ్యడం జరిగింది. ఒక ప్రక్క తెలంగాణాలో నిన్న, ఎన్నికలు జరుగుతున్నా నేపథ్యంలో ఈ అంశముఫై ఏ రాజకీయ వేత్త , ప్రజా ప్రతినిధులు మాట్లాడకూడదని ఎన్నికల కమిషన్ ఆంక్షాలు విధించడం జరిగింది. ఈరోజు (శుక్రవారం) ఐజీ స్థాయి అధికారులు సాగర్ చేరుకొని పరిస్థితి అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సుమారు 3వేల క్యూసెక్కుల నీరు పైగా ఏపీకి విడుదల? అయ్యిందని భావిస్తున్నారు. రాయలసీమ రైతులలో హర్షం వ్యక్తం అవుతుంది. నిజానికి సాగర్ నిర్వహణ తెలంగాణకు అప్పగించిన కేంద్రం శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ మాత్రం ఏపీ ప్రభుత్వానికి అప్పగించినప్పటికీ చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు.. 2014- 15 సమయంలో శ్రీశైలం ప్రాజెక్టు కూడా తమ భూభాగంలో ఉందని కెసిఆర్ సర్కార్ దానిని కూడా ఆధీనంలోకి తీసుకొంది. ఇన్నాళ్లకు సీఎం జగన్ దూకుడుతో నాగార్జున సాగర్ లో కూడా సగం పార్ట్ ను ఏపీ ప్రభుత్వం తమ హక్కుగా ఆదీనంలోకి తెచ్చుకొంది. ఇక చూడాలి..కేంద్రం వైఖరి..
