సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం ఆర్య వైశ్య యువజన సంఘ భవనం నందు భీమవరం మండల న్యాయసేవాధికార సంస్థ మరియు సిటీజన్స్ ఫోరమ్ సంయుక్తంగా నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు సిటీజన్స్ ఫోరమ్ అధ్యక్షులు బొండా వెంకటేశ్వర రావు అధ్యక్షత వహించగా ముఖ్య అధితిగా హాజరైన 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి, ఏ . పవన్ కుమార్ మాట్లాడుతూ.. మానవుని ఆలోచన సరళి మీదే ఆధారపడి సమాజం ఉంటుంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎప్పుడైతే విచ్ఛిన్నమైనదో అప్పుడే సమాజంలో నేరప్రవృతి పెరగడం మొదలైంది. ప్రస్తుతకాలంలో సోషల్ మీడియా ద్వారా పబ్లిసిటీకి ఇచ్చిన ప్రాధాన్యత మనుష్యులకు ఇవ్వడంలేదు. చట్టాల ఉల్లంఘన జరగకుండా చూడవలసిన బాధ్యత సమాజంలో ఉన్న ప్రతీ వ్యక్తిది. నల్సా లీగల్ సర్వీసెస్ అనే యాప్ ద్వారా ఇంటి నుండే వారి వారి సమస్యను మండల జిల్లా, రాష్ట్ర, జాతీయ న్యాయ సేవాధికార సంస్థలకు దరఖాస్తు చేసుకోవచ్చును. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు లైసెన్సు లేకుండా వాహనాలు ఇవ్వరాదు. త్రిబుల్ రైడింగ్ చేయకూడదని చెప్పాలన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు యేలేటి న్యూటన్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మానేపల్లి సూర్యనారాయణ గుప్తా, జనరల్ సెక్రటరీ, V. కరుణాకర రావు, న్యాయవాదులు పాల్గొన్నారు.
