సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం నేడు, శనివారం స్థానిక, పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో జిల్లా కార్యదర్శి, జె ఎన్ వి గోపాలన్ అధ్యక్షతన జరిగిన పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. సీతారాం మాట్లాడుతూ.. రాష్ట్ర పాలనా రాజధానిగా ప్రజల కోరిక మేరకు పరిపాలన, శాససరాజధాని అమరావతిలోనే కొనసాగాలని సిపిఎం నిశ్చితాభిప్రాయం అన్నారు. ఈ సందర్భంగా అమరావతికి, రాష్ట్రానికి బిజెపి చేసిన అన్యాయాలను ఆయన ప్రస్తావించారు. రాజధాని నిర్ణయంతో తమకు సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. పలుమార్లు పార్లమెంటులో అమరావతిని గుర్తించడానికి నిరాకరించింది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజన హామీల అమలుతో పాటు, పలు విషయాల్లో బిజెపి రాష్ట్రాన్ని దగా చేసిందని దుయ్యబట్టారు. డెల్టా జిల్లా కార్యదర్శి బి.బలరాం మాట్లాడుతూ.. భీమవరంలో టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు వెంటనే అందించాలి అలాగే జిల్లాలో అనేక పట్టణాల్లో వేలాది టిడ్కో ఇళ్లు నిర్మించి నేటికీ లబ్దిదారులకు అందించకపోడం దురదృష్టకరమన్నారు..రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పేరుతో ఓటిఎస్ పధకాన్ని తీసుకువచ్చి ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు.రబీ సాగుకు సాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో రోడ్ల వ్యవస్థ చాలా అద్వాన్న స్థితిలో ఉందన్నారు. ప్రజల ప్రాణాలు దృష్టిలో ఉంచుకుని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *