సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇప్పటికే రాష్ట్రంలో మామిడి, పొగాకు, మిర్చిరైతులు నష్టాల బాటలో ఆందోళన చెందుతుంటే.. తాజగా ఉమ్మడి గోదావరి జిల్లాలులో ఆయిల్‌పామ్ రైతులు కూడా పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఆందోళన చెందుతున్నారు. వరిలో అంతరపంటగా వేసుకుని ఉద్యానవన పంటగా ప్రభుత్వ రాయితీలు పొందిన కొందరు రైతులు పామాయిల్ సాగు చేపడుతున్నారు. మన రాష్ట్రంలో 1,96,801 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేపడుతున్నారు. 39.36 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేస్తూ దేశంలోనే మన రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది.ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ద్వారకా తిరుమల, జంగారెడ్డి గూడెం చింతల పూడి పరిసర ప్రాంతాలలో పామాయిల్ సాగు అధికంగా ఉండగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 76,014 ఎకరాల్లో రైతులు ఆయిల్‌పామ్ సాగు చేపడుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని 27.5 శాతంనుంచి 16.5శాతానికి తగ్గించడంతో ఆయిల్‌పామ్ రైతులు తీవ్రంగా నష్టపోతామని ఆందోళన చెందుతున్నారు. గతేడాది టన్ను పామాయిల్గెల ధర రూ.20 వేల నుంచి రూ.21 వేల వరకు పలికింది. దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో టన్ను రూ.18,650కు పడిపోయింది.ఒకప్రక్క నిర్వహణ ఖర్చులు పెరిగి ఒకేసారి రూ.2 వేలు తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
