సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరడంతో జిల్లా పరిషత్‌లో మొదలైంది. జడ్పీ లో వైసీపీ కి పెద్ద ఎత్తున తిరుగులేని సభ్యుల మెజారిటీ సంఖ్యా ఉన్నపటికీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం చెందినతరువాత వైసీపీ తరపున విజయం సాధించి జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన పెదపాడు జడ్పీటీసీ ఘంటా పద్మశ్రీ ఇటీవల టీడీపీలో చేరడంతో ఆమెపై అనర్హత వేటు వేయాలని, దీని కోసం అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ ఐదు గురు వైసీపీ జడ్పీటీసీలు గత శనివారం జడ్పీ సీఈవో కేఎస్‌ఎస్ సుబ్బా రావుకు వినతి పత్రం సమర్పించారు. అయితే ఈ వినతి పత్రం నిబంధనల ప్రకారం జిల్లా కలెక్టర్‌కు సమర్పించాలని, అయినప్పటికీ నిబంధనలు ప్రకారం చర్యలు తీసుకుంటానని వారికి చెప్పినట్టు సీఈవో తెలిపారు. ఈ వినతి పత్రంపై ఏకంగా 26 మంది మెజారిటీ జడ్పీటీసీ సభ్యులు సంతకాలు చేశారు. వైసీపీ అధినేత ఎంతో విశ్వాసంతో బిసి కి చెందిన మహిళగా గౌరవించి జడ్పీ చైర్మెన్ హోదా కల్పిస్తే ఆమె పార్టీకి ద్రోహం చెయ్యడం దారుణమని, ఆమె కు చైర్మెన్ గా కొనసాగే అర్హత లేదని ఆ వైసీపీ జడ్పీలు వాపోయారు. జడ్పీటీసీ ఘంటా పద్మశ్రీ ముందుగా జనసేన లో చేరాలని భావించినప్పటికీ టీడీపీ లో చేరారు. టీడీపీ లో కొందరు ఎమ్మెల్యే లు పార్టీలో ఆమె చేరికను బహిరంగంగా వ్యతిరేకించడం గమనార్హం.
