సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దసరా పండగ నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు వచ్చేస్తున్నాయి. .సకుటుంబ సమేతంగా పిల్లలను తీసుకుని తిరుమల శ్రీవారి దర్శనం చేసుకొందామనుకొనే భక్తులకు ఆన్ లైన్ లో అప్పటికే ఆ రోజులలో టికెట్స్ బుక్ అయిపోవడం జరుగుతుంది. అయితే తాము కోరిన రోజు శ్రీవారిని దర్శించుకోవాలనుకొనే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చర్యలు చేపట్టింది.అందులోభాగంగా.. SSD (స్లాటెడ్ సర్వ దర్శనం), దివ్య దర్శనం, ఉచిత దర్శనం వంటివి అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ SSD టికెట్లు ప్రతిరోజు ఉదయం 3 గంటలకు తిరుపతిలోని (తిరుమలలో కాదు కొండ క్రింద ) విష్ణు నివాసం, శ్రీనివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్ వద్ద ఇస్తారు. ఈ టికెట్స్ తీసుకోవాలంటే.. ఆధార్ కార్డు మాత్రం తప్పనిసరిగా ఉండాలి. ఇక SSD టికెట్లు ఇచ్చేటప్పుడు.. టైమ్, ఎంట్రీ వివరాలు సైతం ఇస్తారు. దీంతో ఆ నిర్ణయించిన టైమ్‌లో దర్శనానికి వెళ్లి.. తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరుడిని ఉచితంగానే దర్శించుకోవచ్చు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామునే వెళ్లి టికెట్లు పొందితే స్వామి వారి దర్శనం సులభం అవుతుంది. ఇక మరికొందరు కాలినడకనే తిరుమలకు వెళ్తారు. వారికి సైతం భూదేవి కాంప్లెక్స్, శ్రీవారి మెట్టు వద్ద దివ్య దర్శనం టికెట్లు మంజూరు చేస్తారు. ఈ టికెట్ల ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు. . ఓ వేళ.. ఈ టికెట్లు సైతం దొరక్కొంటే.. తిరుమలలో ఉచిత క్యూలైన్‌లో వెళ్లిపోవచ్చు. కానీ ఈ ఉచిత దర్శనానికి వెళ్తే మాత్రం చాలా సమయం పడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *