సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆరు రైల్వే స్టేషన్లను జూన్‌ 1వ తేదీ నుంచి మూసి వేస్తున్నట్టు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ప్రకటించింది. ప్యాసింజర్‌ రైళ్ల రద్దీ, ట్రాఫిక్‌, ప్రయాణ సమయాలు, విద్యుత్‌ వాడకం, ఖర్చుల వృథా వంటి తదితర అంశాలపై ఈ నిర్ణయం అధికారికంగా ప్రకటించారు. ప్రయాణికుల సంఖ్య 25 కంటే తక్కువగా నమోదవుతుండడంతో ఈ స్టేషన్లను నెల క్రితమే మూసివేశారు. వీటిలో ముస్తాబాద్‌, పెద అవుటపల్లి, తేలప్రోలు, వట్లూరు, దెందులూరు, తాడేపల్లి గూడెం సమీపంలోని బాదంపూడి రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఆ స్టేషన్లలో సింగిల్‌ నెంబరుకు మించి ప్రయాణికులు ఉండడం లేదు. ఈ నేపథ్యంలో రైల్వేకు ఆదాయం లేకపోగా, ప్రయాణంలోకొంత సమయం వృథా అవుతోందని గుర్తించారు. ఇక ఫై ఆయా స్టేషన్లలో ఇప్పటి వరకు రైల్వే సేవలు ఉపయోగించుకున్న ప్రయాణికులు ఇకపై పక్క స్టేషన్లకు వెళ్ళవలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *