సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ నిలిపివేశారు. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికలు, తదుపరి ఏపీలో వచ్చే 6నెలల లో ఎన్నికలు దృష్ట్యా జనసేన పార్టీకి ప్రాధాన్యత ఇచ్చే క్రమం లో పవన్ కళ్యాణ్ దర్శకుడు హరీష్ శంకర్ కు నిర్మాతలు మైత్రి మూవీస్ వారికీ ఎన్నికలు అయ్యాక వచ్చే 7 నెలలు తరువాత తిరిగి షూటింగ్ ప్రారంభిద్దాం అని చెప్పేశారని..? దానితో దర్శకుడు హరీష్ ఈ నెల 20 నుండి రవితేజ హీరోగా పీపుల్ ఫ్యాక్టరీ వారి కొత్త సినిమా ప్రారంభిస్తున్నట్లు తెలుస్తుంది. దీనితో గబ్బర్ సింగ్ తరహాలో ఎన్నికలకు ముందే ఉస్తాద్ భగత్ సింగ్’ మాస్ హిట్ కోసం కోసం ఎదురుచూసిన పవన్ అభిమానులకు నిరాశ తప్పడం లేదు. అయితే పవన్ చేస్తున్న మరో చిత్రం ఓజీ ‘ మాత్రం దాదాపు షూటింగ్ పూర్తీ చేసుకొంటునట్లు తెలుస్తుంది..ఈ నెల 30న జరగనున్న తెలంగాణ ఎన్నికలలో పవన్ బీజేపీ కోసం కాకపోయిన .. కనీసం జనసేన పోటీచేస్తున్న 8 సీట్లలో అభ్యర్థుల ప్రచారం కోసం ఇంకా బరిలోకి దిగకపోవడం అనేక ప్రశ్నలు తలెత్తున్నాయి.
