సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో సిద్ధాంతాల పేరుతొ ప్రజల అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకొంటున్న మావోయిస్టుల ఉనికి లేకుండా చెయ్యాలని“ఆపరేషన్ కగార్ ‘పేరుతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా భద్రతా దళాలకు ఇచ్చిన ఆదేశాల మేరకు దక్షిణాదిన ఛతీస్ ఘడ్ తెలంగాణ, ఆంధ్ర ఏజెన్సీ ప్రాంతాలలో పెద్ద ఎత్తున మావోయిస్టులను ఎన్కౌంటర్ లలో భద్రతా దళాలు మట్టుబెడుతున్న నేపథ్యంలో .. తాజగా నేడు,బుధవారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, మావోలకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతిచెందగా.. చాలామందికి గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ ఆపరేషన్‌లో బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ DRG బలగాలు భారీగా పాల్గొన్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
