సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగువారి ఆరాధ్య దైవం , తెలుగుదేశం వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 29వ వర్థంతి సందర్భంగా కడప జిల్లా మైదుకూరులో సీఎం చంద్రబాబు నేడు, శనివారం పర్యటించారు.‘‘సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అన్న సూక్తిని.. తొలిసారి రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది ఎన్టీఆర్. నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన.. మహనీయుడు ఎన్టీఆర్. .ఎన్టీఆర్ ఆశయ సాధనలో అనుక్షణం పనిచేస్తాం. తెలుగు జాతిని నెంబర్ వన్‌గా మారుస్తాం’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్ లోని నారా లోకేష్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళ్లు నివాళ్లు అర్పించిన తదుపరి.. ఎన్టీఆర్ ఘాట్ పెచ్చులు ఊడిపోవడం గమనించి గాట్ మరమ్మతు పనులు తన సొంత నిధులతో వెంటనే చేపట్టాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణను హెచ్ఎండీఏ అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఇదేనా ఓ మహానేతకు ఇవ్వాల్సిన గౌరవం అంటూ అసహనం వ్యక్తం చేసారు.
