సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ అనుమతి ఉన్న ప్రవేట్ ఆస్పత్రులు ఎన్టీఆర్ వైద్య సేవలను నాలుగు రోజులుగా నిలిపివెయ్యడంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆసుపత్రులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 2000 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని ఆస్పత్రుల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. నాన్ ఎమర్జెన్సీ ఓపీడీ సేవలను ఆపడం ద్వారా తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. ఎన్టీఆర్ వైద్య సేవల సీఈవో రూ. 670 కోట్లు చెల్లిస్తామని ప్రకటించినప్పటికీ, ఆస్పత్రులు తమ డిమాండ్‌ను కొనసాగిస్తున్నాయి. రెండు రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించాయి. నెట్ వర్క్ ఆస్పత్రులులో విద్యావంతులకు ప్రత్యేక ప్యాకేజీ కింద దాదాపు రూ. 2.5 కోట్ల బకాయిలను కూడా ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది అని తెలుస్తుంది.
