సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఉదయం నుంచే తీవ్ర ఉద్రిక్తతల మధ్య పోలింగ్ కొనసాగింది. చాల ప్రాంతాలలో స్థానిక ఓటర్లు ను ఓటు వెయ్యకుండా పోలీసులే అడ్డుకొన్నారని వారి కళ్ళకు మొక్కిన ఓటు వేసే అవకాశం ఇవ్వలేదని, అసలు వైసీపీ తరపున పోటీ చేసిన ZPTCఅభ్యర్థినే వారి గ్రామా ప్రజలను ఓటు వెయ్యకుండా అడ్డుకున్నారని వారే మీడియా ఛానెల్స్ ముందు వాపోయిన దృశ్యాలు పలు మీడియా చేనెల్స్ లో నేటి ఉదయం నుండి చూస్తూనే ఉన్నారని అని వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి కూడా తనను పోలీసులు అరెస్ట్ చెయ్యడం, ఓటర్లు ను అడ్డుకొని టీడీపీ అభ్యర్థులకు అనుకూలంగా రిగ్గింగ్ ఓట్లు వేసుకొన్నారని ఆరోపించడం జరిగింది. ఇవ్వన్నీ ఈసీ పరిశీలనకు వచాయో? లేదో? కానీ పులివెందులలో సా.4 గంటల వరకు 74.57 శాతం పోలింగ్‌ నమోదవగా.. ఒంటిమిట్టలో సా.4 గంటల వరకు 66.39 శాతం పోలింగ్‌ నమోదయ్యింది అని తెలుస్తుంది. సాయంత్రం 5 గంటల్లోపు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఉంది. కాగా, వచ్చే గురువారం నాడు జడ్పీటీసీ ఉపఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *