సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి ఎపీపీఎస్సీ నేడు, మంగళవారం 3 నోటిఫికేషన్లు విడుదల చేసింది. వ్యవసాయ శాఖలో 10 అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాల నియాకానికి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 19 నుంచి సెప్టెంబర్ 8 వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర దేవాదాయ శాఖలో 7 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువరించింది. ఈ నెల 13 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.ఇక, భూగర్భజల శాఖలో 4 టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి కూడా ఎపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 13 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.ఎపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో జాబ్ నోటిఫికేషన్లను పొందుపరిచారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *