సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నికలు దగ్గర పడుతున్న వేళా జగన్ సర్కార్ ప్రజా సంక్షేమం ఫై ఎక్కువ ద్రుష్టి పెట్టి నిధులు సరిపోక ఏపీలోని ప్రధాన ఆర్ & బి రోడ్లను అభివృద్ధి పరచలేదు అన్న విమర్శలును ఈ ఎన్నికల ముగింట పూర్తిగా చెరిపివేసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా శరవేగంగా రోడ్ల అభివృద్ధి చేస్తుంది.( వీటిలో కొన్ని ప్రధాన రహదారులకు కేంద్ర నిధులు సహకారం కూడా ఉంది). ఇప్పటికే చాల రోడ్డులు నూతన రోడ్డు లుగా మారిపోయి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా వాహనాలు దూసుకొని పోతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే భీమవరం నుండి ఉండి , ఆకివీడు మీదుగా కైకలూరు వరకు విశాలంగా సుమారు 45 కిమీ రోడ్డు నిర్మాణం పూర్తీ అయ్యింది. ( మధ్యలో 2 ప్లై ఓవర్లు నిర్మాణం కూడా పూర్తీ కావస్తుంది. ) ఇంకా కైకలూరు నుండి ఏలూరు వరకు కూడాసుమారు 20 కిమీ కొత్త రోడ్డు నిర్మాణం పూర్తీ కావస్తుంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటీవల రోడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో పనులు చురుగ్గా సాగుతున్నా యి. భీమవరం నుండి టీపీ గూడెం వైపు విష్ణు కాలేజీ వరకు ఇప్పటి వరకు ఉన్న గుంతల రోడ్డు స్థానంలో ఇటీవల 3 కోట్ల నిధులతో సుమారు 3 కిమీ రోడ్డు పనులు మరో 4 రోజులలో పూర్తీ కావస్తున్నాయి. ఏకంగా 2 దశాబ్దాలు తరువాత టీపీ గూడెం నుండి భీమవరం వైపు 32 కి. మీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తీ కావస్తున్నాయి. జిల్లా కేంద్రం భీమవరం పట్టణానికి నలువైపులా ప్రధాన రహదారులు సరికొత్తగా నిర్మాణాలు పూర్తీ కావస్తున్నాయి.భీమవరం పట్టణంలో కేంద్ర రైల్వే శాఖ సుమారు 40 కోట్ల నిదులతో ఏకంగా ఏడాది క్రిందటే 6 భారీ అండర్ టర్నల్స్ నిర్మాణం పూర్తీ అయ్యి ట్రాఫిక్ రద్దీ తగ్గింది. వీరవాసరం పెనుమంట్ర వరకు కొత్త సిమెంట్ రోడ్డు వేస్తున్నారు. మొత్తం మీద పశ్చిమ గోదావరి జిల్లాలో 6 రాష్ట్ర రహదారులు,19 జిల్లా ప్రధాన, గ్రామీణ రోడ్ల నిర్మాణానికి ఇటీవల సుమారు రూ.84 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో సుమారు 230కి లోమీటర్లరోడ్ల నిర్మా ణానికి ఆర్ & బి శాఖ పనులు చేపట్టింది. 41.5 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులకు రూ.22.30 కోట్లు, 19 ప్రధాన జిల్లా, గ్రామీణ రోడ్లకు రూ.62.14 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ రోడ్ల నిర్మాణానికి ఇప్పటికే టెండర్లను పూర్తిచేసి కాం ట్రాక్టర్లు ఏక కాలంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
