సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పట్టణం శివారులో ఉండి మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు సంతాప సభకు హాజరయ్యేందుకు నేడు, సోమవారం భీమవరం వచ్చిన రాజంపేట ఎంపీ, వైఎస్ఆర్సిపి డిస్ట్రిక్ట్ రీజనల్ కోఆర్డినేటర్ పి మిథున్ రెడ్డి ముందుగా ఎమ్మెల్యే గ్రంధిశ్రీనివాస్ ఇంటికి మర్యాదపూర్వకంగా రావడం తో ఆయనకు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆయనకు శాలువ కప్పి సాధారపూర్వక స్వాగతం పలికారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంగా భీమవరం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయనకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం నుండి రైల్వే శాఖ ద్వారా ఇప్పటికే పలు అండర్ టర్నల్ ను నిర్మించడం జరిగిందని అయితే ఇంకా రావాల్సిన సహకారం ఉందన్నారు పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించే విధంగా నరసింహపురం రైల్వే గేట్ వద్ద, బైపాస్ రోడ్ రైల్వే గేట్ వద్ద, ఉండి రైల్వే గేట్ వద్ద అండర్ టన్నెల్స్ ను నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీ మిథున్ రెడ్డికి, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ కు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వినతిపత్రం అందించారు. పట్టణంలోనే 2 లక్షల పైగా జనాభా ఉన్నారని, భీమవరం జిల్లా కేంద్రం కావడం వల్ల జిల్లా నలు మూలల నుండి నిత్యం ప్రజలు తమ పనులు నిమిత్తం భీమవరం వస్తున్న నేపథ్యంలో మరో ఈ మూడు అండర్ టన్నెల్స్ ను కూడా నిర్మించినట్లయితే ట్రాఫిక్ సమస్యలు అనేవి ఉండవని ఆయన ఎంపీల దృష్టికి తీసుకెళ్లారు.ఎంపీ మిథున్ రెడ్డి వెంట ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్, జక్కంపూడి గణేష్ లు ఉన్నారు. వారు ఈ 3 టర్నల్స్ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొనివెళతామన్నారు
