సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. దీనిలో గత జగన్ ప్రభుత్వ హయంలో కీలక శాఖలలో పనిచేసిన అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీల పర్వము మొదలయ్యింది. ఐఏఎస్ అధికారులు వై. శ్రీలక్ష్మి, రజత్ భార్గవ, ప్రవీణ్ ప్రకాశ్ ను ప్రస్తుతం ఉన్న పోస్టుల నుంచి వైదొలగాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. వీరికి ఏ పోస్టూ కేటాయించలేదు ఈ నేపథ్యంలో తాజగా .. నూతన డీజీపీగా ఐపీఎస్ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్న ద్వారకా తిరుమలరావును రాష్ట్ర పోలీస్ బాస్‌గా చంద్రబాబు ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ద్వారకా తిరుమల రావు 1989 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి కావడం గమనార్హం.
