సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏమిటో విచిత్రంగా శీతాకాలం లో కూడా ఆంధ్ర ప్రదేశ్ ను భారీ వర్షాలు వెంటాడుతున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 6, 7 తేదీల్లో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది తీరం వైపునకు అల్పపీడనంగానే వచ్చి బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తమిళనాడు, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఈ నెల ఆరు, ఏడు తేదీల్లో వర్షాలు కురిసే అవకాశముంది. ఇదికాకుండా మరో వాయుగుండం పొంచివుంది. ఈ నెల రెండో వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని, అది బలపడి వాయుగుండంగా మారే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *