సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభ వార్త, రాష్ట్రంలో ఎంప్లాయిస్ GLI, GPF బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. నేటి సోమవారం ఉదయం 11.30 గంటల నుంచి ఉద్యోగుల ఖాతాల్లో బకాయిలు జామా చేస్తున్నారు. మొత్తం బకాయిలలో రూ. 6 వేల 200 కోట్లు విడుదల చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో నిధులు జమా అవుతున్నాయి ఎల్లుండి బుధవారం సాయంత్రానికి కల్లా పూర్తి స్థాయిలో నిధులు విడుదల అవుతాయని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.
