సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన 3 ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ నేటి సోమవారం ఉదయం నుండి మొదలయిన నేపథ్యంలో నేటి సాయంత్రానికి ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. 2వ ప్రాధాన్యత ఓట్లు లెక్కించే పరిస్థితి ఎక్కడైనా వస్తే మాత్రం ఆలస్యం అవుతుంది. ఇక మరో విశేషం ఏమిటంటే .. నేటి ,సోమవారం ఏపీ లో ఎమ్మెల్యేల కోటాలో మరో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల శంఖారావం పూరించింది. (MLC Seats) ఈ మార్చి నెల 10వ తేదీ వరకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ దాఖలకు అవకాశముంటుంది. 11న నామినేషన్ల పరిశీలన, 13 నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఈ నెల 20న పోలింగ్ జరగనుండగా అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహిస్తారు. జంగాకృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, అశోక్ బాబు..యనమల రామకృష్ణుడుల పదవి కాలం ఈ నెల 29 తో ముగియనుంది. వీరంతా టీడీపీ ఎమ్మెల్సీ లే..( జాంగా కూడా వైసీపీ నుండి గెలిచి టీడీపీ కి మద్దతు ఇచ్చారు) అయితే మరల ఎమ్మెల్యే ల ఓట్లతో ఈసారి కూటమి అభ్యర్థులే గెలిచే అవకాశం ఉంది. పవన్ సోదరుడు నాగబాబు ఎమ్మెల్సీ అయ్యి మంత్రి పదవిని అధిష్టిస్తారని జనసేన క్యాడర్ భావిస్తుంది.
