సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) జూన్ 27న విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత ఉప ముఖ్యమంత్రి పవన్ ను కలవడం తదుపరి సంప్రదింపుల నేపథ్యంలో ఆ సినిమా టికెట్ రేట్లు పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విడుదలైన రోజు నుంచి 14 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతిచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై 75 రూపాయలు, మల్టీప్లెక్స్‌లో టికెట్‌పై 125 రూపాయలు పెంచేందుకు అనుమతిచ్చింది. రోజుకు 5 షోలు వేసుకునేందుకు అనుమతి ఇస్తూ ఈ మేరకు హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.( గత వైసీపీ సర్కార్ అయితే టికెట్ రేటుపై 40-70రూపాయల కు మించి అనుమతించేది కాదు). దీనితో మరోసారి బాహుబలి సిరీస్ కలెక్షన్స్ రికార్డు లను బ్రద్దలు కొట్టే అవకాశం కల్కి కి హిట్ టాక్ వస్తే అవలీలగా వస్తుంది. దీనితో సుమారుగా సాధారణ థియేటర్స్ లో 200 రూ- 225 . మల్టి ఫ్లెక్స్ లో 300 రూ. వరకు టికెట్ రేటు వరకు పలికే అవకాశం ఉంది. అయితే అగ్ర తారాంగణం తో సుమారు 500 కోట్ల భారీ సినిమా విజువల్ వండర్ గా భావిస్తున్న కల్కి చూడడానికి ఆబాల గోపాలం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు
