సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇండియన్ స్టీల్ అసోసియేషన్ (ISA) ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నేడు సోమవారం ప్రారంభమైన 6వ ISA స్టీల్ కాన్‌క్లేవ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక వృద్ధిలో ఉక్కు పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోందని, ఇది దేశ జీడీపీలో దాదాపు 2% వాటాను కలిగి ఉందని తెలిపారు. దేశ ప్రగతికి, స్వయం సమృద్ధికి ఇది చాలా ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నక్కపల్లిలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ (AMNS) నూతనంగా ఏర్పాటు చేస్తున్న భారీ ఉక్కు పరిశ్రమకు కావలసిన అన్ని అనుమతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేశాయని, త్వరలోనే శంకుస్థాపన జరగనుందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ (AMNS) ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నందుకు కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు మరియు ఇండియన్ స్టీల్ అసోసియేషన్ అధ్యక్షులు నవీన్ జిందాల్, సెయిల్ సీఎండీ అమరేంద్ర ప్రకాష్, ఇండియన్ స్టీల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *