సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శ్చిమ గోదావరి జిల్లాలో రైతుల సార్వా పంట పండించడానికి యూరియా కొరతను నివారించడానికి అధికారులు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, కోఆపరేటివ్ సొసైటీలు, రైతు సేవా కేంద్రాల రైతాంగానికి సరిపడా యూరియా, డిఎపి ఇతర ఎరువులను సరఫరా చెయ్యాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లబోయిన రంగారావు, ఎం.సీతారాంప్రసాద్, ఎఐటియుసి నాయకులు కిలారి మల్లేశ్వరరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వై.వి.ఆనంద్, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి మల్లుల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సిపిఐ ఆధ్వర్యంలో భీమవరం తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి తహశీల్దార్ రావి రాంబాబుకు వినతి పత్రం అందజేశారు. జిల్లాలో క్షేత్ర స్థాయిలో పరిస్ధితులు దారుణంగా ఉన్నాయని ద్వజమెత్తారు. కోఆపరేటివ్ సొసైటీలు, రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రతి ఎకరాకు 200 కిలోలకు తగ్గకుండా ఎరువులు అందించాలని నాయకులు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *