సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో జన గణన చేపట్టడానికి అనుమతిస్తూ కేంద్రం గెజిట్‌ నోటీఫికేషన్ తాజగా జారీ అయ్యింది. వ‌చ్చే ఏడాది నాటికి జన గణన, కుల‌గ‌ణ‌న‌ పూర్తి కానుంది. కొత్త జనాభా లెక్కల ఆధారంగా దేశ వ్యాప్తంగా లోక్‌సభ స్థానాలు.. శాసనసభ స్థానాల పునర్విభజన ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టనుంది. రాజ్యాంగంలోని 170వ అధికరణలోని సెక్షన్‌-15 ప్రకారం శాసనసభ స్థానాలను ఆంధ్రప్రదేశ్‌లో 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 134కు పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని విభజన చట్టం-2014లో సెక్షన్‌-26(1) ద్వారా ఎన్నికల సంఘానికి కేంద్రం నిర్దేశించింది. వాస్తవానికి జన గణన 2020లో ప్రారంభమై 2021 నాటికి పూర్తి కావాలి. కానీ.. కరోనా మహమ్మారి మూడు విడతలుగా దేశ వ్యాప్తంగా ప్రబలింది. అంతలోనే 2024 సార్వత్రిక ఎన్నికలు ముంచుకు రావడంతో మరింత ఆలస్యం అయ్యింది. కొత్త నియోజక వర్గాల నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలోనే అతి పెద్ద నియోజకవర్గంగా 2న్నర లక్షల పైగా ఓటర్లు కలిగి ఉన్న భీమవరం నియోజకవర్గం కూడా 2 నియోజకవర్గాలుగా మారటం ఖాయం గా కనిపిస్తుంది. వచ్చే ఎన్నికలకు ఓటర్లు మరింత శాతం పెరగటం తో పాటు భీమవరం టౌన్ 1 లో విస్సాకోడేరు, శృంగవృషం కలుపుతూ మరియు 2 టౌన్ బేస్ ప్రతిపాదనగా ఉండి లోని కాళ్ళ మండలం కలుపుతూ 2 నియోజకవర్గాలు మారే అవకాశాలు? చాల ఉన్నాయి. అంటే భవిషత్తు లో భీమవరం కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఖాయంగా రానున్నారు. ఇక జిల్లాలో 2వ పెద్ద నియోజకవర్గం ఉండితో సహా అన్ని నియోజకవర్గాల లో మార్పులు జరిగి 7నుంచి 10 సీట్లుకు పెరగటం ఖాయంగా కనపడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *