సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం విజయవాడలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ రాజ్య సభ ఎం పీ జీవీఎల్ నరసింహరావు మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ వచ్చి ప్రధాని మోడీ దిశానిర్దేశ్యం చేసాక బీజేపీ లోను, రాష్ట్ర ప్రజలలో కొత్త ఆశలు మొదలయ్యాయని అన్నారు. అధికార వైసిపి అవినీతిపై రాష్ట్రంలో ప్రజాపోరు సభల ద్వారా ప్రజలకు వివరిస్తున్నామని, జగన్ సర్కార్ వైఫల్యాలు, ఎండగడుతూ కార్యాచరణ సిద్ధం చేశామని, ఎక్కడికక్కడ పోరాటాలు చేసి, ప్రభుత్వం తీరుపై ఉద్యమిస్తామన్నారు. త్వరలోనే రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందన్నారు. బీజేపీ తో జనసేన కలసి నడుస్తుందని, టీడీపీ తో పొత్తు ఊహాగానాలు మాత్రమేనని కొట్టిపడేసారు. ఎన్నో అనుభవాలతో చూస్తూ చూస్తూ టీడీపీ తో ఎలా పొత్తు కడతాం? అని ఎదురు ప్రశ్నించారు. అధికార వైసిపి ని ఎదిరించే సత్తా టీడీపీకి లేదని, టీడీపీలో అభ్రతభావం స్పష్టంగా కనిపిస్తోంది. తమ సొంత ప్రయోజనాల కోసమే రక్షించమనిబీజేపీ ని టీడీపీ కోరుతోంది అని ఎద్దేవా చేసారు. అధికారంలో ఉన్నప్పు డు టీడీపీ నేతలు ప్రజలను పట్టిం చుకున్న పాపనపోలేదు. ఏపీలో నిజమైన ప్రతిపక్ష పాత్ర మేమే పోషించబోతున్నాము. ఏపీలో బీజేపీలో చేరిన టీడీపీ నేతలు సైతం .. టీడీపీకి భవిష్యత్తు లేదు. ఆ పార్టీ నాయకత్వం పూర్తిగాక్షీణించింది అంటున్నారు. టీడీపీని కేవలం 23 స్థానాలకే పరిమితం చేశారం టే వారిపై ప్రజలలో ఎంత స్థాయిలో అసంతృప్తి ఉందో తెలుసుకోవచ్చు అని వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *