సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడలోని బెంజి సర్కిల్ వద్ద ఉన్న ఐప్యాక్ ఆఫీసుకు నేడు, గురువారం వెళ్లిన సీఎం జగన్.. ఐప్యాక్ టీం (I-PAC Team) సభ్యులతో సుమారు అరగంట పాటు ఉత్సహంగా మాట్లాడారు.సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘ఏపీలో వచ్చే ఫలితాలను చూసి దేశం మొత్తం ఆంధ్రావైపే చూస్తుంది. గతంలో 151 అనేదే చాలా పెద్ద నెంబర్.. 22 ఎంపీ స్ధానాలు కూడా చాలా పెద్ద సంఖ్యే.. ఈసారి 151 కంటే ఎక్కువ స్ధానాలు, 22 ఎంపీ స్ధానాలు కంటే ఎక్కువ సాధిస్తాం’’ అని ధీమా వ్యక్తం చేశారు. ‘‘మీరు ఏడాదిన్నరగా అద్భుతంగా పనిచేశారు. మీ కృషి వల్లే టార్గెట్‌ను సాధించగలుగుతున్నాం. రిషీ చేసిన ఎఫర్ట్ కూడా చాలా గొప్పది. చాలా మందికి ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తున్నారో తెలియడం లేదు.ఆయన అంచనాలకు అందని విజయం సాదించబోతున్నాము. ప్రశాంత్ కిషోర్ కన్నా రిషీ టీం చాలా వర్తీ. ఏపీ రిజల్ట్స్ దేశంలోని ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యపరుస్తాయి. జూన్ 4న వచ్చే నెంబర్లు గతంలో ప్రశాంత్ సాధించిన వాటికన్నా గొప్పగా వస్తాయి. ఎన్నికల తరువాత కూడా మీ టీం సేవలు కొనసాగించండి’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *