సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పడు ఎప్పుడు అని ఊరిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్నాయి. అయితే మొదటగా మున్సిపల్ ఎన్నికలను సెప్టెంబర్‌లో నిర్వహించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారు.. ఆ తర్వాత గ్రామ పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని ఏపీ సర్కార్ అధికారులతో సమాలోచనలు చేస్తుంది. ఈ నెల 27వ తేదీ నుంచి 45 రోజుల పాటు తెలుగుదేశం ఎమ్మెల్యేలు, కూటమి ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో ఇంటింటికీ వెళ్లాలని స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ప్రజా వ్యతిరేకత లేకుండా చూసుకోవాలని సీఎం చంద్రబాబు తాజగా ఆదేశించారు.
