సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజాగా నేడు, బుధవారం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరో డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తొలుత నిర్ణయించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం.. ఈ నోటిఫికేషన్ గురువారం రావాల్సి ఉంది. కానీ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌ను ముందుగానే రిలీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్, పురపాలక పాఠశాలల్లో కలిపి మొత్తం 2,721 ఉద్యోగాల భర్తీకి గాను మూడు వేర్వేరు నోటిఫికేషన్లు రిలీజ్ చేసింది.ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్, పురపాలక పాఠశాలల్లో కలిపి మొత్తం మూడు వేర్వేరు నోటిఫికేషన్లను రిలీజ్ చేసింది ప్రభుత్వం. జనరల్ స్కూళ్లలో 2,111 పోస్టులను, స్పెషల్ ఎడ్యుకేషన్‌లో 350 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.అలాగే సొసైటీలు, ఇతర యాజమాన్యాల్లో 260 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక స్కూల్ అసిస్టెంట్ కోసం- 906 పోస్టులు, SGT-1,205 పోస్టులు ఉన్నాయి. SA స్పెషల్ ఎడ్యుకేషన్-150 పోస్టులు, SGT స్పెషల్ ఎడ్యుకేషన్-200 పోస్టులు, ప్రిన్సిపాల్-30, PGT-81 పోస్టులను భర్తీ చేస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అలాగే TGT-113, ఫిజికల్ డైరెక్టర్-2, PET-34 పోస్టులను భర్తీ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. నవంబర్ 3లోపు పూర్తి నోటిఫికేషన్ జారీ చేసి.. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను కూడా ప్రారంభిస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *