సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు మూడవ సమావేశం నేడు, గురువారం ముగిసింది. 15 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 44,776 కోట్ల పెట్టుబడులకు ఈ సమావేశంలో ఆమోదించారు. మూడు నెలల్లో అర్సెల్లార్ మిట్టల్ స్టీల్, బీపీసీఎల్ వంటి భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన జరుగనుంది. అల్లూరి జిల్లాలో 2300 మెగావాట్ల ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్న నవయుగ ఇంజనీరింగ్ లిమిటెడ్ రూ.14,328 కోట్లతో విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటుకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. అన్నమయ్య జిల్లాలో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్న మేఘా ఇంజనీరింగ్ రూ.10,300 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు మెఘా సంస్థ ప్రతిపాదన సమర్పించింది. అలాగే అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో 118 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటుకు యాస్పరీ లిమిటెడ్‌కు ఆమోదం లభించింది. రూ.972 కోట్లతో అనంతపురంలో అనంతపూర్ రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఆమోదం లభించింది.
