సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ( CM chandrababu) అధ్యక్షతన ఏపీ సచివాలయంలో మంత్రివర్గం సమావేశం (AP Cabinet ) సుదీర్ఘంగా జరుగుతోంది. ఈ సమావేశంలో 21 కీలక అంశాలపై మంత్రిమండలిలో చర్చించి ఆమోద ముద్ర వెయ్యనున్నారు. వీటిలో కీలకంగా రాష్ట్ర జలవనరుల శాఖకు సంబంధించి వివిధ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది కేబినెట్. ఆటో, క్యాబ్‌ డ్రైవర్లకు రూ.15 వేలు ఆర్థిక సాయం ఇచ్చే ప్రతిపాదనకు,కారవాన్‌ పర్యాటకానికి ఆమోదం తెలపనుంది. కేంద్రము నుండి నిధులు వచ్చే అమృత్‌ పథకం 2.0 పనుల కేటాయింపులపై ఓ నిర్ణయం తీసుకోనుంది. అమరావతిలో వివిధ పనుల వేగవంతానికి స్పెషల్‌ పర్సస్ వెహికల్‌ ఏర్పాటుకు కేబినెట్.ఆమోదం తెలపవలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *