సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం రాయలం గ్రామంలోని శ్రీకామాక్షి అమ్మవారి 49వ నవరాత్ర మహోత్సవంలో బాగంగా నేడు, శుక్రవారం దేవాలయ కమిటీ, విశ్వబ్రాహ్మణ సంఘం, శ్రీవిరాట్ విశ్వకర్మ యూత్ అధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అమ్మవారిని దర్శించుకుని మహా నివేదనకు హారతులు ఇచ్చారు. అన్ని దానలకెల్లా అన్నదానం ఎంతో గొప్పదని, భగవంతుని మెచ్చే కార్యక్రమమని, 49 ఏళ్లపాటు దసరా ఉత్సవాలను సాంప్రదాయ బద్దంగా నిర్వహిస్తున్న సంఘం, కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు. అనంతరం అన్న సమారాధనను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. 3 వేల మంది భక్తులు అమ్మవారిని ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు చిప్పాడ రంగబాబు, ఉపాధ్యక్షులు హేమంత్ శ్రీనివాస్, కార్యదర్శి పూడి మల్లేశ్వరరావు, కోశాధికారి కొమ్మోజు శివ శ్రీను, విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చిప్పాడ శివ కాశీ తదితరులు పాల్గొన్నారు.
