సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ని పార్టీ అధిష్ఠానం తాజగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. పార్టీ ప్రకటించిన 8మంది జాబితాలో దక్షిణాదినుంచి సంజయ్‌కే చోటు దక్కింది. కాగా, బండి సంజయ్‌ను ఏపీ బీజేపీ (AP BJP) వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా నియమించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఏపీ ఇన్‌చార్జ్‌ సునీల్‌ దేవ్‌ధర్‌ను జాతీయ కార్యవర్గం నుంచి తొలగించిన నేపథ్యంలో ఏపీకి బలమైన జోష్ ఉన్న నాయకుడిని నియమించాల్సిన అవసరం ఏర్పడింది. తెలంగాణాలో ఫైర్‌బ్రాండ్‌ నాయకుడిగా పేరున్న సంజయ్‌ను ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమించడం ద్వారా గతంలో తెలంగాణాలో బీజేపీ క్యాడర్ ను బండి సంజయ్ దూకుడుతో ఎలా అభివృద్ధి పరిచారో ఇక్కడ కూడా అదే తీరున పార్టీని రేజ్ చేస్తారని భావిస్తున్నారు. అయితే తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళా తనను తప్పించడం తో డీలా పడిన సంజయ్ ఆంధ్ర లో అంత జోష్ తో పనిచేస్తారా ? పైగా జనసేన పవన్ కళ్యాణ్ తో అంత సఖ్యత ఉన్నట్లు కనిపించదు.మరి పొత్తు ధర్మాన్ని ఎలా ముందుకు తీసుకొనివెళ్తారో చూడాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *