సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టీడీపీ అధినేత చంద్రబాబు నేడు శుక్రవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లో జరిగిన జోన్-2 తెలుగుదేశం శిక్షణా శిబిరంలో ఆయన పాలు పంచుకున్నారు. ఏలూరు, నరసాపురం, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం లోక్ సభ స్థానాల నేతలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. దీనిలో భీమవరం నుండి జిల్లా పార్టీ అడ్జక్షురాలు తోట సీతారామ లక్ష్మి, మెంటే పార్ధసారధి, మెరగని నారాయణమ్మ వంటి పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. చంద్రబాబు క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌చార్జ్‌లతో ఆయన ముఖాముఖి భేటీ అయ్యారు. పార్టీ నియోజకవర్గ కన్వీనర్లు, మండల అధ్యక్షులతో పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఏ మేరకు ఎంత పనిచేశారో గణాంకాలతో వెల్లడించే ప్రయత్నం చేశారు.‘మనం పార్టీపై శ్రద్ధపెట్టినప్పుడు ఓటమి ఎరగం. మనల్ని ఓడించే శక్తి అంటూ ఏదీ లేదు. ఒకప్పుడు రాజకీయాల్లో పోరాడేవాళ్ళం. ఇప్పుడేమో రాష్ట్రంలోని వింత జంతువులతో పోరాడుతున్నాం. మనుషులకు ఓ మనస్సు ఉంటుంది. సైకో.. కింద ఉన్న వారికి అలాంటిదేమీ లేదు’ రావణాసురు డితో పోరాటం చేస్తున్నామని అని టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్ నుద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. జగన్ బాబాయ్ వివేకానంద హత్య ఫై సీబీఐ విచారణ జరుపుతుంటే అదంతా తప్పని సీఎం సలహాదారు అంటారు. రూ.40 కోట్లు వివేక హత్యకు సుపారీగా ఇచ్చారు. ఆ డబ్బులు ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుంచి వచ్చాయంటూ నిలదీస్తూనే సజ్జల సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటూ ఆరోపణలు చేసారు. వివేకానందరెడ్డి హత్య ముమ్మాటిని అంతఃపుర హత్యగా చంద్రబాబు ఆరోపించారు.
